Breaking News

శాసనమండలిలో టీడీపీ అడ్రస్ గల్లంతు

14441472673

తెలంగాణ శాసనమండలిలో తాజా ఎన్నికల ఫలితాలతో టీడీపీ అడ్రస్ గల్లంతు అయ్యింది.. ఇన్నేళ్ల టీడీపీ హయాంలో ఎన్నడూ లేనిది.. ఇప్పుడు టీడీపీ ని ఖాళీ చేయించడంలో సీఎం కేసీఆర్ కృతకృత్యులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 స్థానాలున్నాయి.. తాజాగా స్తానిక సంస్థల కోటా 12 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలతో టీడీపీ అడ్రస్ గల్లంతు అయ్యింది..

మొత్తం 40 స్థానాలకు గాను ప్రస్తుతం 28 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులున్నారు. దీంతో బలం మండలిలో మొత్తంలో మూడవ వంతుకు చేరింది.. మిగతా స్థానాల్లో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు, ఆ తర్వాత స్థానాల్లో ఎంఐఎం రెండు, బీజేపీ 1, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు.

సీఎం కేసీఆర్ పన్నిన వ్యూహరచనతో టీడీపీ ఖాళీ అయ్యింది. ప్యూచర్ లో మళ్లీ పునరుద్దరణకు గురయ్యే అవకాాశమే లేకుండా పోయింది.. దాదాపు తెలంగాణలో టీడీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *