శారీరక శ్రమ చేయటమే క్రీడాకారులు మరిన్ని విజయాలు సాదించవచ్చు

గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న 38 వ జాతీయ స్థాయి మాస్టర్స్ చాంపీయన్ షిప్ – 2017 కార్యక్రమంలో టూరిజం మరియు స్పోర్ట్స్ కార్యదర్శి బుర్ర వేంకటేశం ముఖ్య ఆథిది గా పాల్గోన్నారు. జాతీయ స్థాయి ఆద్లేటిక్స్ చాంపీయన్ షిప్ లో పాల్గోన్న క్రీడాకారులకు మెడల్స్ బహూకరించి ఆభినందించారు. స్పోర్ట్స్ కార్యదర్శి బుర్ర వేంకటేశం. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న జాతీయ మాస్టర్స్ ఆథ్లేటిక్స్ చాంపీయన్ షిప్ లో ముదిమిలో మూడు పదుల ఉత్సాహంతో పాల్గోన్న వెటరన్ క్రీడాకారుల ఆరోగ్య రహస్యం పై క్రీడాకారులను ఆడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులు నిత్యం శ్రమ చేయడమే తమ ఆరోగ్య రహస్యమని స్పోర్ట్స్ కార్యదర్శి బుర్ర వేంకటేశం కు వివరించారు.

వయస్సుతో సంబందం లేకుండా నిరంతరం శారీరక శ్రమ చేయటమే క్రీడాకారులు మరిన్ని విజయాలు సాదించవచ్చు ఆన్నారు బుర్ర వేంకటేశం . మాస్టర్స్ ఆథ్లేటిక్స్ చాంపియన్ షిప్ పోటిల్లో వెటరన్ క్రీడాకారుల విన్యాసాలు నేటి యువతకు స్పూర్పిగా నిలుస్తాయన్నారు. ముదిమి వయస్సు లో ఇంత చలాకీగా ఉండటం పై కారణాలేమిటో కోంతమంది వెటరన్ క్రీడాకారులతో మాట్లాడారు. 76 ఏళ్ల పద్మనాభన్ , 81 ఏళ్ల సత్యమూర్తి, 79 ఏళ్ల పుష్పకుమారి , 83 ఏళ్ల గంగాధర రావు , 79 ఏళ్ల పుష్పకుమారి, 82 ఏళ్ల మల్లెంపాటి సత్యనారాయణ లు ఈ ఆథ్లేటిక్స్ చాంపియన్ షిప్ లో పాల్గోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాంపియన్ షిప్ లో విజయం సాదించిన వెటరన్ క్రీడాకారులకు బహుమతులు ఆందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజేషం గౌడ్, మాస్టర్స్ అథ్లేటిక్స్ ఫేడరేషన్ ఆప్ ఇండియా సేక్రటరీ జనరల్ డేవిడ్ ప్రేమ్ నాథ్, మాస్టర్స్ అథ్లేటిక్స్ ఫేడరేషన్ ఆప్ తెలంగాణ ఆధ్యక్షులు మెుగిలయ్యలు పాల్గోన్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.