శారీరక అభివృద్ధికి క్రీడలు దోహదపడతాయి: ఈటెల

కరీంనగర్: విద్యార్ధుల శారీరక దారుడ్యానికి క్రీడలుఎంతో దోహదపడతాయని రాష్ర్ర్ట ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం మానకొండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ర్ట సాంస్కృతిక సారధి మానకొండూర్ శాసన సభ్యుఅ ఆధ్వర్యంలో ఏర్పాటు
చేసిన నియోజక వర్గ స్ధాయి క్రీడల ఎం.పి, ఎమ్మెల్యే కప్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు విద్యతో పాటు క్రీడల్లో పాల్గొన్నారని అన్నారు. విద్యార్ధుల మానస వికాసానికి, పట్టుదల పోటీతత్వం పెంచుటకు క్రీడలు దోహదపడుతాయని అన్నారు. జాతీయ క్రీడలకు కరీంనగర్ జిల్లా వేడుక కావాలని, ఇదివరకే జిల్లలో కత్తిసాము, రెజ్లింగ్ జాతీయ పోటీలు జరిగాయని అన్నారు. రాష్ట్ర్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత నిస్తుందని అన్నారు. పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. సానియా మీర్జాను తెలంగాణా బ్రాండ్ అంబాజిడర్ గా నియమించామని సిందూను గౌరవించి ప్రోత్సహించామని తెలిపారు. క్రీడల వల్ల విద్యార్ధులో చైతన్యవంతులవుతారని అన్నారు. కరీంనర్ నుండి క్రీడాకారులు ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తులఉమ మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్ధులలో స్నేహ భావం, దేశభక్తి పెంపొందుతుందని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటమిలు ముఖ్యం కాదని, పాల్గొనడమె ప్రధానమని అన్నారు. రాష్ట్ర్ర సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర్రంలో మొదటి సారిగా మానకొండూర్ లో నియోజక వర్గ స్ధాయి ఎం.పి, ఎమ్మెల్యే కప్ క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 6 మండలాలకు సంబందించిన 300 విద్యార్ధులు క్రీడల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు, పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి 6 మండలాల ఎంపిపి లు, జెడ్ పిటిసి లు సర్పంచ్ లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.