శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యం

శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పోలీస్ శాఖకు 300కోట్ల రూపాయలను కేటాయించిందని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖకు నూతనంగా మంజూరు కాబడిన 70నూతన బోల్లేరా మోడల్ వాహనాలను మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నాడు పరేడ్ మైదానంలో ఏర్పాటైన కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించడంతో పాటు స్వయంగా వాహనాన్ని నడిపారు. అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఆదర్శ, అగ్రరాష్ట్ర్రంగా తెలంగాణ ఏర్పడేందుకు కృషి జరుగుతోందని, శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే ఇది సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించి పోలీస్ శాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్పదని తెలిపారు. రాష్ట్ర్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజలకు విశ్వాసం కల్పించడమే కాకుండా నమ్మకాన్ని కల్పించే కేంద్రాలుగా తీర్చిదిద్దబడుతాయని చెప్పారు. నూతన వాహనాల మంజూరుతో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే చేరుకుని సత్వరం సేవలందించే సదుపాయం లభించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల మొదటి తేదీన జీతాలు వస్తున్న విధంగానే హోంగార్డులకు సైతం అదే విధంగా జీతాలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పోలీస్ స్టేషన్ లకు నెలకు 25వేలు, నగర ప్రాంత పోలీస్ స్టేషన్ లకు ఖర్చుల నిమిత్తం 50వేల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లా ఎస్పీ వి.శివకుమార్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ విభాగానికి నూతనంగా డిఎస్పీని, అదనంగా ఒక ఇన్స్ పెక్టర్, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్. హెచ్.వో స్ధాయిని ఇన్స్ పెక్టర్ హోదాకు తిమ్మాపూర్ రూరల్ సర్కిల్ ఏర్పాటునకు కృషి చేసిన జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్, శాసనసభ్యులు గంగుల కమలాకర్, దాసరి మనోహర్ రెడ్డి, సోమవరపు సత్యనారాయణ, బోడిగె శోభ, నగర మేయర్ రవీందర్ సింగ్, జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్, అడిషనల్ ఎస్పీ బి.జనార్ధన్ రెడ్డి, ఓ.ఎస్.డి ఎల్. సుబ్బారాయుడు, డి.ఎస్పీ.లు జె.రామారావు, సంజీవ్ కుమార్, మల్లారెడ్డి, రాజేంద్రప్రసాద్, ఎన్.మల్లారెడ్డి, స్ధానిక పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *