శశి కి షాక్ – పన్నీర్ కు కేక్

శశి కి షాక్ - పన్నీర్ కి కేక్

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం పై ఆశలు పెట్టుకున్న శశికళకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సుప్రీం కోర్టులో జయలలిత అక్రమాస్తుల కేసుపై తీర్పు వెలువడింది. నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో శశికళ రెండో నిందితురాలు. శశికళ దోషిగా ఆమె కటకటాల పాలు కావడం ఖాయమని తేలిపోయింది. ఫలితంగా సుప్రీం తీర్పు ప్రతికూలంగా రావడంతో.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరనేదానిపై అన్నాడీఎంకేలో తీవ్ర చర్చ జరుగుతోంది. సోమవారం గోల్డెన్ బే రిసార్ట్స్‌కు వెళ్లిన శశికళ ఇదే అంశంపై అనుచర ఎమ్మెల్యేలతో చర్చించారు. జయలలిత మేనల్లుడు దీపక్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో శశికళ ఉన్నట్లు సమాచారం. అంతర్గతంగా ముగ్గురు పేర్లను ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆయన నివాసం వద్ద కార్యకర్తలు డ్యాన్స్ లతో కేరింతలు కొడుతున్నారు. పన్నెండు మంది ఎంపి లు, పది మంది ఎమ్ఎల్యే లు మద్దతు ఉన్న పన్నీరు సెల్వం శిబిరంలోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు శశికళ శిబిరంనుంచి జారుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు డిజిపి ని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అయితే కోర్టు తీర్పుపై పన్నీర్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. ధర్మ యుద్ధంలో అన్యాయం ఎన్నటికీ పైచేయి సాధించదనడానికి సుప్రీం కోర్టు తీర్పే నిదర్శనమని పన్నీరు పంచన చేరిన నేతలు చెప్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కోర్టు ఆదేశాల మేరకు శశికళకు చెందిన అనేక అక్రమాస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శశికళ, ఇళవరసి, సుధాకరన్ వెంటనే కోర్టులో లొంగిపోవాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి శశికళ అనర్హురాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *