శభాష్ పల్లి వద్ద వంతెన నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన

తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సిరిసిల్ల, వేములవాడ-కరీంనగర్ లను కలిపే ప్రధాన రహదారి పై రాకపోకలకు అడ్డంగా ఉన్న శభాష్ పల్లి మానేరు వాగుపై 4 వరుసల బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ ఇవాళ శంకుస్తాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ సమావేశంలో మాట్లాడారు. మంత్రి తో పాటు ఎంపీ వినోద్, ఎమ్మెల్యే శోభ, జడ్పీ చైర్మన్ తుల ఉమ, ఈద శంకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యల్ని రెండు నెలల్లో పరిష్కరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.