
ఆద్య -నిక్షిత సమర్పణలో “అయిలూస్ మీడియా హౌస్”
బ్యానర్ పై సీనియర్ జర్నలిస్టు అయిలు రమేష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న “శంకర్ మామ టెన్త్ ఫెయిల్” సందేశాత్మకమైన లఘుచిత్రం ఆదివారం నాడు కరీంనగర్లో షూటింగ్ ప్రారంభమైంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకూడదు అని, టెన్త్ ఫెయిల్ అయిన శంకర్ అనే వ్యక్తి తన జీవితంలో ఎలా ఉన్నత స్థాయికి ఎదిగారు అనేది ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు దర్శకులు అయిలు రమేష్ తెలిపారు.
ఈ చిత్రంలో లో యూట్యూబ్ స్టార్స్ సుమన్ గౌడ్ అలియాస్ శంకర్, ప్రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ లఘుచిత్రంలో సీనియర్ జర్నలిస్ట్ నగునూరి శేఖర్, మాడిశెట్టి గోపాల్ , మరో యూట్యూబ్ స్టార్ సీతామాలక్ష్మి , సింహాచలం యతింధర్ , తిప్పర్తి ప్రభాకర్, గద్దె ఉదయ్ కుమార్ , కిషోర్ దూలూరు , రామ్ మొగిలోజి, శివ ప్రసాద్ Kadarla, రవీంద్ర చారి, నరేష్ కట్కూరి ,మారుతి స్వామి, వంశీకృష్ణ అయిలు, మహేష్ కన్నం, భాను, వెంకట ప్రసన్న ,సంతోష్, గోపి , వేణు తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: కిషన్ నునుకొండ ,ఎడిటింగ్ :రాము మొగిలోజి, మేకప్ : అశోక్ శ్రీరామోజు ,రచనాసహకారం :వై.రత్నారెడ్డి,అసిస్టెంట్ డైరెక్టర్: రవీంద్ర చారి , నిర్మాత : అయిలు రమేష్ , కథ ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అయిలు రమేష్.