వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు అద్భుతం: మంత్రి పోచారం

వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు అద్భుతం, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఉత్తరాఖండ్ వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి శ్రీ శుభోద్ ఉనియాల్ తెలంగాణ పర్యటనలో బాగంగా గురువారం నాంపల్లి హాకా భవనంలోని తెలంగాణ సేంద్రీయ విత్తన దృవీకరణ ఏజెన్సి కార్యాలయంలో మంత్రి పొచారంతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి పొచారం రాష్ట్ర పథకాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం నాలుగు సంవత్సరాలే అయినా వ్యవసాయ, సంక్షేమ రంగంలో అద్భుత పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడగానే రైతులను రుణ విముక్తులను చేశాం. రూ. 16,124 కోట్లను మాఫి చేశాం. రాష్ట్రంలో మొత్తం సాగుయోగ్యమైన భూమి 1.25 కోట్లు కాగా అందులో 23 లక్షల కరంటు మోటార్ల క్రింద 50 లక్షల ఎకరాలు సాగులో ఉంది. 25 లక్షలు సాగునీటి ప్రాజెక్టుల క్రింద, 50 లక్షల ఎకరాలు వర్షాధారం. మొత్తం భూమిని సాగునీటి ప్రాజెక్టుల క్రిందకు తీసుకువచ్చి ఏటా రెండు పంటలకు సాగునీరందించడానికి లక్షా యాబై వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది, ఇందుకోసం ప్రతీ ఏటా బడ్జెట్ లో రూ. 25,000 కోట్లు కెటాయిస్తున్నాం. వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్టం కూడా తెలంగాణనే అని తెలిపారు. దేశంలో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం అత్యధిక నిధులను కెటాయిస్తుంది. 42 లక్షల మందికి పెన్షన్ల కోసం 5,570 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. మైక్రో ఇరిగేషన్ కోసం గత ఏడాది రూ. 1000 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో SC/ST లకు 100 శాతం, BC లు ఇతర సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ కల్పిస్తున్నాం. మెకనైజేషన్ లో బాగంగా అత్యధిక సబ్సిడీతో 10,000 ట్రాక్టర్లు, 600 హార్వేస్టర్లను పంపిణీ చేశాం. పంట పెట్టుబడి పథకం కోసం ఎకరాకు రూ. 8000 ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇందుకోసం బడ్జెట్ లో రూ. 12,000 కోట్లు కెటాయించాం. ప్రతి రైతుకు అయిదు లక్షల భీమా అందిస్తున్నాం. ఇందుకోసం ప్రతి రైతుకు అయ్యే రూ. 2271 లను ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగం అభివృద్ది కోసం, రైతు సంక్షేమం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. స్వయంగా రైతే అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు రైతుల అభివృద్దే ద్యేయంగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కొత్త రాష్ట్రమైనా విత్తనోత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి అన్నారు. సుమారు 400 సీడ్ కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వ్యవసాయ రంగంలో, విత్తనోత్పత్తి రంగంలో అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని మంత్రి పొచారం హామి ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ మంత్రి ఉనియాల్ గారిని శాలువాతో సత్కరించి, వెంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని బహుకరించారు. తమ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఉనియాల్ మంత్రి పొచారంను కొరారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్ధసారది IAS , కమీషనర్ జగన్మోహన్ IAS, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ యల్. వెంకట్రామి రెడ్డి, తెలంగాణ సేంద్రీయ విత్తనాభివృద్ది ఏజెన్సి డైరెక్టర్ డా. కేశవులు, ఉత్తరఖండ్ వ్యవసాయ శాఖ బృందం సభ్యులు పాల్గొన్నారు.

pocharam srinivasa reddy 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *