
పోమవారం రోజు హైదరాబాదులోని సచివాలయంలో వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్. ఆధ్వర్యంలో పంటల బీమాపై రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం అయింది.
ఈ సమావేశంలో గత సీజన్ లో లాగే ఈ ఖరీఫ్-2018 లోను వివిధ జిల్లాలకు సంబంధించిన అవే 6 క్లస్టర్స్ ఉంటాయని వ్యవసాయ కార్యదర్శి అన్నారు. ఈ ఖరీఫ్ లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, సవరించిన వాతావరణాధారిత పంటల బీమా రెండింటికి ఉమ్మడిగానే నోటఫికేషన్ జారీ చేయనున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర్లు, మినుములు, సోయాబీన్, పసుపు, వేరుశనగ పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద, పత్తి, మిర్చి, బత్తాయి, పామాయిల్ పంటలు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా కింద ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్-2018 కి సంబంధించి మాత్రమే సమావేశం జరిగింది. నష్ట పరిహారం కోసం చెల్లించే స్థాయి 80 శాతంగానే నిర్ణయించారు. ఒకే ఇన్సురెన్సు కంపెనీ రెండు పంటల బీమాలను అమలు చేస్తుంది. టి.ఎస్.సి.ఎ.బి. 2018-19 స్కేల్ ఆఫ్ పైనాన్సును అందజేస్తుంది. యూనిఫైడ్ ప్యాకేజి స్కీం కింద జిల్లాలు గతంలో నిర్ణయించిన విధంగానే కొనసాగుతాయి. టర్మ్ షీట్సు/విధి విధానాలు రూపొందించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. పంటల బీమా గడువు తేదీలు ఖరీఫ్-2017 లాగే ఉంటాయి.
ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్., ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్. వెంకటరామి రెడ్డి, డైరెక్టర్ షుగర్స్ భద్రుమాలోక్, డి.ఇ.ఎస్. జాయింట్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి, జ్యోతి సి.జి.ఎం. టి.ఎస్.క్యాబ్, రాజేశ్వరీ సింగ్ ఎ.ఐ.సి. డి.జి.ఎం., షేక్ మీరా- సి.ఇ.ఓ. టి.ఎసి.బి.పి.ఎస్., ఎస్.ఎల్.బి.సి. ప్రతినిధి, ఆర్.బి.ఐ. ప్రతినిధితో సహా వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, షుగర్స్ అధికారులు, ఎస్.బి.ఐ., జనరల్ ఇన్సూరెన్సు, హెచ్.డి.ఎఫ్.సి., చోళ, బజాజ్ అలియంజ్, ఎప్.ఐ.డి.డి., ఎన్.ఐ.సి.ఎన్., ఆర్.జి.ఐ.సి.ఎల్. ఫ్యూచర్ జనరల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో పాటు టి.ఎస్. డి.పి.ఎస్., ల అధికారులు పాల్గొన్నారు.