వ్యవసాయం వద్దు.. వ్యాపారం చేయండి..

అమరావతి : ఏపీ రాజధాని కోసం భూమిలిచ్చిన రైతులకు తన జీవితాంతం రుణపడి ఉంటానని.. వారికి  కోటి రూపాయల దాకా లబ్ధి చేకూరుస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కష్టనష్టాలకోర్చి వ్యవసాయం చేసేకంటే వ్యాపారం చేయడమో.. పారిశ్రామిక వేత్తలుగా ఎదగడమో చేయాలని చంద్రబాబు రైతులకు సూచించారు. ఏపీ రాజధాని అమరావతికి భూమి పూజ అనంతరం ఆయన సభ నుద్దేశించి మాట్లాడారు.

ఏపీలో రాజధాని కూడా లేదని.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొని వెళ్లి ప్రపంచంలోనే ఉత్తమ రాజధానిని నిర్మిస్తానని చెప్పారు. హైదరాబాద్ సైబరాబాద్ ను నేనే అభివృద్ది చేశానన్నారు. రైతులు కొత్త రాజధానికి భూములిచ్చి సహకరించడం తన జీవితంలో మర్చిపోనన్నారు.

అందరూ తననొక విజనరీ అంటారని.. రాజధాని నిర్మాణం, ఏపీ అభివృద్ధిలో తన విజినరీ చూపిస్తానన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *