వ్యభిచార గృహాలకు వెళ్లి నాయకుల గ్యాంగ్ రేప్

rape

తిరుపతిలో ఓ ముఠా క్రైం పోలీసులమని చెప్పి గ్యాంగ్ రేప్ లకు పాల్పడింది. వ్యభిచార గృహంలోని మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడి వారిని దోపిడీ చేశారు.

తిరుపతి నగరానికి చెందిన బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాటకొండ విశ్వనాథ్, నవ జన సమాజ ఫెడరేషన్(ఎన్.జె.ఎస్.ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్, మరో ఇద్దరు యువకులు కలిసి ముఠాగా ఏర్పడి గత నెల 27న రాజీవనగర్ పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలోని వ్యభిచార గృహానికి వెళ్లి బెదిరించారు. తాము క్రైం పోలీసులమని చెప్పి అక్కడ ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు. అనంతరం అదేరోజు రాత్రి మళ్లీ నిర్వాహకుడికి ఫోన్ చేసి ఓ మహిళను రమ్మని చెప్పి విశ్వనాథ్ తో పాటు ముగ్గురు స్నేహితులు ఓ లాడ్జీలో సామూహిక అత్యాచారం చేశారు. మళ్లీ 10న తిరుపతికే చెందిన వంశీ అనే నిర్వాహకుడిని బెదిరించి ఓ యువతిని తీసుకెళ్లారు. ఆ యువతిని ప్రతిఘటించగా కొట్టి అత్యాచారం చేశారు. ఆ యువతి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *