వైభవంగా ఉత్తమ జర్నలిస్టు అవార్డుల ప్రదానం

 ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కు సంబంధించి 2008, 2009, 2010 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అవార్డులను అందజేసింది. సమాచారం భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌర సంబంధాల కమీషనర్ నవీన్ మిట్టల్, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లీ, సమాచార చీఫ్ ఇంజనీర్ కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్ లు   సుజాత, వెంకటేశం, డిప్యూటి డైరెక్టర్ లు భాస్కర్, శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ లు హష్మీ, పవన్ కుమార్, వెంకట సురేష్, తెలంగాణ మాస పత్రిక చీఫ్ ఎడిటర్ రామ్మోహన్ ,తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
2008 సంవత్సరానికి గాను ఎం.నర్సింగరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డు ను ఖమ్మం జిల్లా సూర్య పత్రిక బ్యూరో చీఫ్ వనం వెంకటేశ్వర్లు, షాయబుల్లాఖాన్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డ్ ను డెక్కన్ క్రానికల్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ పుల్లూరు నరేందర్, అబిద్ అలీ ఖాన్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డు ను సయ్యద్ బాసిద్ మోహినుద్దీన్ అలీ, ఉత్తమ ఎలక్ట్రానిక్ జర్నలిస్టు అవార్డు ను ఎన్ టీ వీ సీనియర్ రిపోర్టర్ రహనా బేగం లు అందుకున్నారు.
 2009సంవత్సరానికి గాను  బి. నాగేశ్వరరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డు ను డెక్కన్ క్రానికల్  పొలిటికల్ ఎడిటర్  గౌరి శంకర్ ,  కాస సుబ్బారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డ్ ను కరీంనగర్ సాక్షి సీనియర్ రిపోర్టర్ బోలగం శ్రీనివాస్, ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డు ను రాష్ట్రీయ సహారా ఉర్దూ దిన పత్రిక లో పని చేస్తున్న అర్జుమందు భాను, అబిద్ అలీ ఖాన్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డు ను సియాసత్ ఆన్లైన్ ఎడిటర్ రసియా నహీమ్ హస్మి, ఉత్తమ ఎలక్ట్రానిక్ జర్నలిస్టు అవార్డు ను టీవి9  రిపోర్టర్ కవితలు అందుకున్నారు.
 2010 సంవత్సరానికి గాను  బి. నాగేశ్వరరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డు ను వార్త దిన పత్రిక సీనియర్ రిపోర్టర్ కె. రమేష్ బాబు ,  మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డ్ ను ప్రజా పోరాటం ఎడిటర్ జగన్మోహన్ రావు,  ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డు ను సియాసత్  ఉర్దూ దిన పత్రిక లో పని చేస్తున్న సీనియర్ రిపోర్టర్ రత్న చోత్రాని, అబిద్ అలీ ఖాన్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డు ను ఎం ఏ రహీమ్,  ఉత్తమ ఎలక్ట్రానిక్ జర్నలిస్టు అవార్డు ను వరంగల్ టీవి9  రిపోర్టర్ దొంతు రమేష్, ఉత్తమ వీడియో గ్రాఫర్ అవార్డు ను హైదరాబాద్ టీవీ9 లో పనిచేస్తున్న రంగ అందుకున్నారు.
DSC_0101 DSC_0108DSC_0112 DSC_0115 DSC_0118 DSC_0122 DSC_0125DSC_0129 DSC_0132 DSC_0135 DSC_0139DSC_0142 DSC_0148DSC_0155

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *