వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డిని క‌లిసిన టిజిజిడిఎ

ప్ర‌భుత్వ వైద్యులకు వెన్నుద‌న్నుగా స‌ర్కార్

ఇప్ప‌టికే అనేక స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

మ‌రికొద్ది రోజుల్లో మిగ‌తా వాటికి మోక్షం

హైద‌రాబాద్: తెలంగాణ ప్ర‌భుత్వం ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్ర‌భుత్వ‌మ‌ని, గ‌తంలో తెలంగాణ ప్ర‌భుత్వ వైద్యుల సంఘం ప్ర‌భుత్వం ముందుంచిన అనేక డిమాండ్లను ప‌రిష్క‌రించామ‌ని, మిగిలిన వాటిని త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ స‌చివాలయంలోని త‌న చాంబ‌ర్‌లో త‌న‌ను క‌లిసి తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం ప్ర‌తినిధుల‌కు మంత్రి ఈ మేర‌కు హామీ ఇచ్చారు. టీచింగ్ డాక్ట‌ర్ల‌కు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం, ట్రాన్స్‌పోర్ట్ అల‌వెన్స్‌, డిహెచ్ క్యాడ‌ర్ స్ట్రెంథ్‌, వైద్య విధాన ప‌రిష‌త్ అబ్సార్ప‌షన్స్‌, హెల్త్ కార్డులు, ట్రెజ‌ర‌రీ సాల‌రీలు వంటి ప‌లు స‌మ‌స్య‌ల‌ను మంత్రి దృష్టికి తెచ్చారు. 15 రోజుల్లో ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అయ్యే విధంగా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే ప‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యాయ‌ని, మిగిలిన ఈ స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించాల్సిందిగా సూచించారు.

ఈ స‌మావేశంలో వైద్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, డిఎంఇ డాక్ట‌ర్ ర‌మేశ్‌రెడ్డి, తెలంగాణ ఔష‌ధ సేవ‌లు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సంస్థ ఎండి వేణుగోపాల‌రావు, చీఫ్ ఇంజ‌నీర్ ల‌క్ష్మ‌ణ్‌రెడ్డి, తెలంగాణ ప్ర‌భుత్వ వైద్యుల సంఘం అధ్య‌క్షుడు ప‌ల్లం ప్ర‌వీణ్‌, ఉపాధ్య‌క్షుడు న‌ర‌హ‌రి, కోశాధికారి లల్లూ ప్ర‌సాద్‌,  తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్య‌క్షుడు జూప‌ల్లి రాజేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *