వైద్య ఆరోగ్య‌శాఖలో త్వ‌ర‌గా నియామ‌కాల పూర్తి

వైద్య ఆరోగ్య‌శాఖలో త్వ‌ర‌గా నియామ‌కాల పూర్తి

 

ఉన్న‌తాధికారుల‌కు వైద్య మంత్రి ఆదేశాలు

స‌చివాల‌యంలో స‌మీక్షించిన ల‌క్ష్మారెడ్డి

వైద్య ఆరోగ్య‌శాఖ‌లో నియామ‌కాల‌ను సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. వైద్య‌శాఖలో నియామ‌కాల మీద స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో గురువారం మంత్రి సంబంధిత ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించారు. అనంత‌రం సిఎం పేషీ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ        న‌ర్సింగరావుని క‌లిసి ఉద్యోగాల భ‌ర్తీపై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య‌శాఖ‌లో గ‌త కొంత కాలంగా ఏర్ప‌డ్డ ఖాళీలు, ఈ          మ‌ధ్య కాలంలో ప‌దోన్న‌తుల కార‌ణంగా ఏర్ప‌డిన ఖాళీల నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు వైద్యులు, ఫార్మాసిస్ట్‌,          న‌ర్సింగ్‌, పారా మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకై ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌న్నారు. అయితే ఆయా పోస్టుల‌కు టిఎస్ పిఎస్ సి ద్వారా నియామ‌కాల‌ను చేప‌ట్టాల‌ని సిఎం నిర్ణ‌యించార‌న్నారు. అయితే ఆయా ఉద్యోగాల భ‌ర్తీలో సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తిన నేప‌థ్యంలో వాటిని వెంట‌నే నివృత్తి చేస్తూ, నియ‌మ‌కాల‌ను వేగంగా పూర్తి చేయాల‌న్నారు. ఇందుకు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

కాగా, అధికారుల‌తో స‌మీక్ష ముగిసిన వెంట‌నే మంత్రి ల‌క్ష్మారెడ్డి సిఎం పేషీ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ న‌ర్సింగరావుని క‌లిశారు. వైద్య‌శాఖ‌లోని ఉద్యోగాల నియామ‌కాల భ‌ర్తీ, ప్ర‌క్రియ‌పై  చ‌ర్చించారు. వేగంగా నియామ‌కాలు పూర్తి కావ‌డానికి tspsc- అధికారుల‌ మధ్య స‌మ‌న్వ‌యంతో సాగేలా చూడాల‌ని కోరారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో మంత్రితోపాటు స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ రాజేశ్వ‌ర్ తివారీ, వైద్య విద్య సంచాల‌కులు డాక్ట‌ర్ ర‌మేశ్‌రెడ్డి, ఆరోగ్య‌శ్రీ సిఇఓ, నిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌నోహ‌ర్‌, ఆరోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ ల‌లిత‌కుమారి త‌దిత‌రులు ఉన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *