Breaking News

వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్ ప్రతిపాదనల మీద సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి

వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్ ప్రతిపాదనల మీద సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి

సచివాలయంలోని తన ఛాంబర్ లో అధికారులతో సమావేశమైన మంత్రి

ప్రస్తుత, భవిష్యత్ అవసరాల దృష్ట్యా కనీసం 50 శాతం నిధులు అదనంగా వచ్చే ఏడాదికి అవసరం అవుతాయని అభిప్రాయ పడిన మంత్రి

ప్రస్తుతం అమలు అవుతున్న వివిధ పథకాలు, వాటి భవిష్యత్ అవసరాలకు, అలాగే రాబోయే ఏడాదికి పెరిగే అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన మంత్రి

విజయవంతంగా అమలు అవుతున్న కిట్ల పథకం కింద మరిన్ని మాతా శిశు ఆరోగ్య వైద్యశాలల నిర్మాణం అవసరం ఉందని, అందుకనుగుణంగా బడ్జెట్ అంచనాలు రూపొందించాలన్నారు.  కొత్తగా నియామకాలు కూడా జరుగుతున్నందున నిధులు ఎక్కువ కావాల్సి ఉంటుందన్నారు.  ప్రభుత్వ వైద్యశాలలకు రోగుల తాకిడి పెరగడం, ప్రజలకు నమ్మకం పెరగడం వల్ల మరిన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందన్నారు రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి, మధుమేహం, బీపీ, క్యాన్సర్ స్క్రినింగ్ వంటి అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు, ఆధునిక పరికరాలు, మరిన్ని మందులు, కొత్త భవనాలు ప్రాతిపదిక చేసుకోవాలన్నారు.  తగు రీతిలో అంచనాలు రూపొందించాలని మంత్రి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ మీద ప్రత్యేక దృష్టి సారించారని, నిధులు ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చారని, అందుకు తగ్గట్లుగా బడ్జెట్ అంచనాలు ఉండలనిం సూచించారు

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, dme రమేష్ రెడ్డి, dh లలిత కుమారి, హెల్త్ వర్శిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్, నిమ్స్ డైరెక్టర్, ఆరోగ్య శ్రీ సీఈఓ డాక్టర్ మనోహర్, ejhs సీఈఓ డాక్టర్ పద్మ, ఆయుష్ కమిషనర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, mnj డైరెక్టర్ డాక్టర్ జయలత,
tsmsidc చీఫ్ ఇంజినీర్ లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *