Breaking News

వైఎస్ అనుకున్నాడు.. కేసీఆర్ పూర్తి చేస్తున్నాడు..

henning_larsen_kiruna_city_hall_02

హైదరాబాద్ : 2007 లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ హైదరాబాద్ శివార్లలో ఐటీ హబ్ తో పాటు వాణిజ్య నగరాన్ని నిర్మించాలని తలంచారు. అందులో భాగంగానే హెచ్ఎండీఏ హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా తెల్లపూర్ లో 167 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ తదనంతరం భూమిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో నగరం నిర్మాణం అటకెక్కింది..

ఈ భూమిలో నగరాన్ని నిర్మించేందుకు అప్పట్లోనే టిస్మస్, ఐసీఐసీఐ , నాగార్జున కనస్ట్రక్షన్ సంస్థలు ముందుకొచ్చి 400 కోట్లతో హెచ్ఎండీఏతో ఒప్పందం కూడా చేసుకొని ఆ మొత్తాన్ని చెల్లించాయి. అప్పటినుంచి ఇప్పటివరకు కోర్టు కేసుల్లో పడి నిర్మాణాలు చేయకపోయాయి ఆ సంస్థలు

ఇప్పుడు సీఎం కేసీఆర్ ను కలిసి సంస్థలు తమ బాధలు చెప్పుకోగానే ఆయన వెంటనే స్పందించారు. కోర్టు కేసుల్లేని భూములను వెంటనే ఈ మూడు సంస్థలకు అప్పగించి నగరాన్నినిర్మించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన లాభంలో 5 శాతం మొత్తాన్ని హెచ్ఎండీఏకు ఇచ్చే లా ఒప్పందం కుదుర్చుకున్నారు.

దీంతో ఈ భూమి అప్పగిస్తే త్వరలోనే హైదరాబాద్ శివార్లలో మరో వాణిజ్య నగరాన్ని మనం చూడవచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *