
కరీంనగర్ జిల్లాలోనే పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి సమస్యలు, వసతుల లేమి వివక్షపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ను కలిసి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వేములవాడపై సవితితల్లి ప్రేమ కనబరిచి యాదగిరి గుట్టకు వందల కోట్లు కుమ్మరిస్తోందని.. ఇప్పటికైనా వివక్షను వీడి వేములవాడ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ కు కరీంనగర్ వేములవాడ రాజన్నపై ప్రేమకలిగి నిధులు మంజూరు చేయాలని.. కలెక్టర్ గా మీరైనా అభివృద్ధి చేయాలని విన్నవించారు.