
కరీంనగర్ : సీఎం కేసీఆర్ గురువారం వేములవాడలో పర్యటించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. కుటుంబ సమేతంగా వేములవాడకు వచ్చిన కేసీఆర్ కు ఆలయ అర్చకులు, పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయం చుట్టు సీఎం దంపతులు ప్రదక్షిణలు చేసి స్వామి వారికి పూజలు చేశారు. కోడెముక్కు చెల్లించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే రమేశ్ బాబు ఉన్నారు.