వేములవాడలో కేసీఆర్ పూజలు

కరీంనగర్ : అయుత చండీయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా సోమవారం కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబానికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తూర్పు ద్వారం నుంచి రాజన్న ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేవారు..

కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయుత చండీయాగాన్ని నిర్వహించిన అనంతరం వచ్చిన సీఎం కేసీఆర్ పండితుల సూచనమేరకే వేములవాడలో పర్యటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *