
వేములవాడ దేవస్థానానికి నిధులు ఇవ్వాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ వేములవాడ దేవస్థానంలో పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యాదగిరి గుట్టకు నిధులు కేటాయించి వేములవాడకు పైసా విదిల్చలేదన మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు బొమ్మ వేంకటేశ్వర్ తో పాటు స్థానిక వేములవాడ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రాజన్న ఆలయానికి చేరుకుని పూజలు చేసి ప్రభుత్వ పక్షపాతాన్ని ఎలుగెత్తి చాటారు.