వెల్ నెస్ సెంట‌ర్‌ని సంద‌ర్శించిన సీఎం కెసిఆర్ గురువు బాల్‌రెడ్డి

ram reddy welness

 

సెంట‌ర్ సేవ‌ల‌పై సంతృప్తి వ్య‌క్తం చేసిన సీనియ‌ర్ సిటిజెన్‌

 

సీఎం కెసిఆర్ చిన్న‌నాటి గురువు దుబ్బాక‌కు చెందిన బాల్‌రెడ్డి త‌న మ‌న‌వ‌రాలు సాయంతో గురువారం హైద‌రాబాద్‌లోని వెల్ నెస్ సెంట‌ర్‌ని సంద‌ర్శించారు. పెన్ష‌న‌ర్ అయిన బాల్‌రెడ్డి ఆరోగ్య ప‌రీక్ష‌ల నిమిత్తం వెల్‌నెస్ సెంట‌ర్‌కి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి.ల‌క్ష్మారెడ్డి విష‌యం తెలుసుకుని వెంట‌నే ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు, జ‌ర్న‌లిస్టుల ఆరోగ్య ఇసిఓ డాక్ట‌ర్ ప‌ద్మ‌, త‌న ప్ర‌జా సంబంధాల అధికారిని అక్క‌డ‌కు పంపించి, త‌గు వైద్య సేవ‌లు, ప‌రీక్ష‌లు స‌జావుగా అందేలా చూశారు. స్వ‌యంగా వారు ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించి, త‌గు మందులు అందించారు. ఈ సంద‌ర్భంగా బాల్‌రెడ్డి వెల్ నెస్ సెంట‌ర్‌లో అందుతున్న వైద్య సేవ‌ల పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. అలాగే త‌న కోసం చొర‌వ తీసుకున్న వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిని అభినందించారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో మంచి వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని, వైద్య ఆరోగ్య‌శాఖ ఎంతో మెరుగు ప‌డింద‌ని శ్లాఘించారు. త‌న వ‌ద్ద చ‌దువుకున్న సిఎం కెసిఆర్ తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. త్వ‌ర‌లో తాను రాయ‌బోయే వ్యాసంలో సీఎం కెసిఆర్‌, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డిలు వైద్య ఆరోగ్యం రంగంలో చేస్తున్న కృషి  వివ‌రాలు పొందుప‌రుస్తాన‌ని పేర్కొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *