వెరైటీగా ఒంగోలులో సౌఖ్యం ఆడియో విడుదల

డిసెంబ‌ర్ 13న ఒంగోలులో వైభ‌వంగా `సౌఖ్యం` ఆడియో విడుద‌ల‌
“సౌఖ్యం అనే మాట‌ను వింటుంటే మ‌న‌సుకు సుఖంగా ఉంటుంది. అహ‌ర్నిశ‌లూ వ్య‌క్తి పాటుప‌డేది సౌఖ్యంగా జీవించ‌డానికే. కుటుంబం సౌఖ్యంగా ఉండాలి. కుటుంబంతో పాటు ఇరుగూపొరుగూ కూడా సౌఖ్యంగా ఉండాల‌నుకునే హీరో కేర‌క్ట‌రైజేష‌న్‌తో అల్లుకున్న క‌థే `సౌఖ్యం“` అని అంటున్నారు ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి. `య‌జ్ఞం` త‌ర్వాత గోపీచంద్ హీరోగా ఆయ‌న రూపొందిస్తున్న సినిమా `సౌఖ్యం`. `లౌక్యం` త‌ర్వాత  గోపీచంద్ క‌థానాయకుడిగా న‌టిస్తున్న సినిమా ఇది.  రెజీనా నాయిక‌గా న‌టిస్తోంది. భవ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి. ఆనంద్‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.
soukhyam
చిత్ర నిర్మాత వి.ఆనంద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ “గోపీచంద్, ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి పేర్లు విన‌గానే ఎవ‌రికైనా `య‌జ్ఞం` సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాను మించేలా ఇప్పుడు `సౌఖ్యం` సినిమాను రూపొందిస్తున్నాం. టాకీ పూర్త‌యింది. మూడు పాట‌ల‌ను కూడా చిత్రీక‌రించాం. మిగిలిన రెండు పాట‌ల‌ను సోమ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో చిత్రీక‌రిస్తాం. దాంతో గుమ్మ‌డికాయ కొడ‌తాం. డిసెంబ‌ర్ 13న ఒంగోలులో వైభ‌వంగా ఆడియో వేడుక‌ను నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నాం. అనూప్ రూబెన్స్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. మా గ‌త చిత్రం `లౌక్యం` పాట‌ల‌ను విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా విడుద‌ల చేశాం. అందుకు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఒంగోలులో `సౌఖ్యం` పాట‌ల వేడుకను నిర్వ‌హిస్తాం. అన్ని వ‌ర్గాల వారినీ అల‌రించే సినిమా అవుతుంది. గోపీచంద్ మార్కు యాక్ష‌న్‌కు, అంద‌రినీ అల‌రించే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను జ‌త చేసి శ్రీధ‌ర్ సీపాన మంచి క‌థ‌ను, అందుకు త‌గ్గ మాట‌ల‌ను రాశారు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం“ అని చెప్పారు.
soukhyam.jpg3
గోపీచంద్‌, రెజీనా జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో షావుకారు జాన‌కి, బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, స‌త్యం రాజేష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు; శ‌్రీధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే:  కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌, ఎడిట‌ర్‌:  గౌతంరాజు, ఆర్ట్ :  వివేక్‌, నిర్మాత‌:  వి.ఆనంద్‌ప్ర‌సాద్‌.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *