
-కాకా ఒక విజ్ఞాన భండాగారం
-రవీంద్రభారతిలో కాకా సంస్మరణ సభలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, ప్రతినిధి : కాకా వెంకటస్వామి జాతి సంపద అని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో కాకా వెంకటస్వామి సంస్మరణ సభను బుధవారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వెంకటస్వామి ఒక విజ్ఞాన భండాగారం అని కొనియాడారు. ఆప్తులు, అనార్థల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కాకా వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామిగా నిలిచిపోయారన్నారు. ఇదీ తెలంగాణ అని తెలంగాణ ఉద్యమకారులు, నాయకులను కీర్తికిరీటంలో మేటిగా నిలుపుతామన్నారు. ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన కాకా వ్యక్తిత్వం ఔన్నత్యం గొప్పది. తెలంగాణ జాతి సంపద వెంకటస్వామిగా గౌరవించుకుందామని కేసీఆర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాకా కుమారులు వివేక్, వినోద్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కోదండరాం, సీపీఐ కార్యదర్శి నారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.