వృద్ధ కాంగ్రెస్.. యువతకు చోటేది.?

‘కాంగ్రెస్ లో యువతకు చోటు లేదు.. అందుకే కొత్తగా యువకులు ఉధృతంగా దూసుకొస్తున్నా వారికి అవకాశాలు ఇవ్వడం లేదు.. తొక్కేస్తున్నారు.. ఎందుకంటే రాహుల్ కు పోటీగా వస్తారని.. ఎదుగుతారని.. అది మా పార్టీలో లేదు’ అని పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ను కడిగిపారేశాడు.. పార్లమెంటు లో ప్రసంగించిన మోడీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్, కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను ఒక్కోటి ప్రస్తావిస్తూ దుమ్ముదులిపాడు..

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతిపక్షం బీజేపీకి సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ముఖ్యమైన బిల్లుల్ని కూడా కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు.  ఇప్పటికైనా పరస్పర విమర్శల్ని మానుకోవాలని పనిచేద్దాం..  అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే తాము జవాబుదారీగా తయారు చేశామని.. కాంగ్రెస్ సభ్యులు ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *