వీ6 కెమెరామెన్ పై పవన్ అభిమానులు దాడి చేసింది అందుకే..

రామానాయుడు స్టూడియోలో పవన్ కొత్త చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతోంది.. ఈ సందర్బంగా అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం ఆహ్వానించేందుకు ఏపీ మంత్రులు పవన్ ను కలిసేందుకు రామానాయుడు స్టూడియోకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని షూట్ చేసేందుకు మీడియా మిత్రులు స్టూడియోకు వెళ్లగా ప్రధానంగా వీ6 కెమెరామెన్ పై పవన్ అనుచరులు దాడి చేశారు. వీ6 విలేకరపై కూడా పిడిగుద్దులు గుద్దారు.

కాగా ఇటీవల బ్రూస్ లీ ఆడియో లాంచ్ లో చిరంజీవి అభిమానుల్ని తిట్టింది వీ6 బాగా ఫోకస్ చేసింది.. చిరంజీవిపై కథనాలు ప్రసారం చేసి మెగా ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలోనే వీ6 విలేకరి కెమెరామెన్ ను చూడగానే పవన్ అనుచరులు దాడులకు పాల్పడ్డారు.

కాగా దాడులకు గురైన వీ6 , ఇతర మీడియా మిత్రులను దగ్గరకు తీసుకొని పవన్ క్షమాపణ చెప్పారు. కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా కు  సారీ చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *