వీ ఆర్ ఏ ల సమస్యలను పరిష్కరిస్తాం.

వ

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ ఐ టీ శాఖ మంత్రి కె టి ఆర్.

వీ ఆర్ ఏ ల సమస్యలు పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ స్వష్టం చేసారు.సోమవారం సచివాలయంలో వీ ఆర్ ఏ సంఘాలతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి కె టీ ఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీ ఆర్ ఏ సంఘాల నాయకులు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ దృష్థికి తమ సమస్యలను తెచ్చారు. మహమూద్ అలీ గారు స్పందిస్తూ వీ ఆర్ ఏల సమస్యలను ముఖ్య మంత్రి    కె సి ఆర్ దృష్టికి తెసుకెలుతానని హామీ ఇచ్చారు.అదే వీద0గా ప్రభుత్వ భూములను రక్షిచాలని కోరారు.వీ ఆర్ ఏ ల సంఘాలన్నీ ఒకే తాటి పై రావాలని కోరారు.వీ ఆర్ ఏ లను స్మార్ట్ ఫోన్లు ఇచ్చే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. బంగారు తెలంగాణ సాధించడానికి వీ ఆర్ ఏ లు కృషి చేయాలని ఆదేశించారు. వీ ఆర్ ఏ లు బాధ్యతగా పని చేయాలని సూచించారు. వీ ఆర్ ఏ లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పధకాలను ప్రజలకు అందేటట్లు బాధ్యత వహి0చాలన్నారు.సమావేశంలో తెలంగాణ ఐ టి మంత్రి కె టీ ఆర్ తో పాటు వీ ఆర్ ఏ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *