వీరేంద్ర సెహ్వాగ్ కు బీసీసీఐ సన్మానం

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను బీసీసీఐ ఈ ఉదయం సన్మానించింది. సెహ్వాగ్ కు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ జ్ఞాపిక బహూకరించి సత్కరించారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ -దక్షిణాఫ్రికా నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ కార్యక్రమం నిర్వహించారు.

సొంత గడ్డపై బీసీసీఐ సన్మానం అందుకోవడం పట్ల సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశారు. సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ ఈ కార్యక్రమానికి పక్కన ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *