
సీనియర్ జర్నలిస్టు,మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ నేతృత్వంలో తెలంగానలో మరో కొత్త పత్రిక రాబోతోంది.. పక్క తెలంగాణ వాదుల ఆధ్వర్యంలో సత్యనారాయణతో పాటు ఆరుగురు బడా బిల్డర్ల సహాయంతో కొత్త పత్రికకు అంకురార్పణ జరిగింది. మెట్రో ఎడిటర్ గా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ కాళిదాస్ దేవరకొండ ఈ పత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.. ఆయనే ఈ గొల్కొండ పత్రికను రిజిస్టర్ చేయించింది.. దీంతో తప్పనిసరిగా ఆయనే ఎడిటర్ అయ్యారు.
ఇప్పటికే జిల్లాల్లో ఎడిషన్లకు స్థలాల సేకరణ పూర్తయి మిషనరీని కూడా దించారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్ లో ని పెట్రోల్ బంక్ ఎదురుగా స్థలాన్ని కొని అందులో మెషీన్లు కూడా దించారు. ఈ మెషీన్లు అత్యాధునికమైనవి.. గంటకు 2 లక్షల కాపీలను కొట్టే సామర్థ్యం కలవి.. అంతేకాదు… పాత వాటిలా కాకుండా చిన్న సైజులో రెండు రూముల్లో పట్టేంత చిన్న సైజులా ఉంటాయట..
దసరాకు రిక్రూట్ మెంట్
కాగా గోల్కొండ పత్రిక దసరాకు రిక్రూట్ మెంట్ మొదలు కాబోతోంది.. ముందుగా బ్రాంచ్ మేనేజర్లు, బ్యూరోలు, రిపోర్టర్లు, యాడ్స్, సర్క్యూలేషన్ మేనేజర్ల నియామకం జరుగనుంది. జిల్లాల్లో కూడా సీనియర్లను అన్వేషిస్తున్నారు. కాగా జీతాల విషయంలోభారీగా ఇస్తున్నట్టు సమాచారం. ఈనాడు, సాక్షి, నమస్తేలలో భారీగానే జీతాలుండడంతో ఒక తక్కువ జీతాలున్న ఆంధ్రజ్యోతి నుంచే ఈ గోల్కొండ పత్రికకు వలసలు ఉండే అవకాశం ఉంది.. సాక్షి లో నుంచి వైదొలిగిన సబ్ ఎడిటర్లు కూడా గొల్కొండలో చేరే అవకాశం ఉంది..