
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలు గురువారం రామోజీ ఫిలిం సిటీలో భేటి కావడం కలకలం రేపుతోంది.. ఈ భేటి ముఖ్యంగా చంద్రబాబు శిభిరంలో కలకలం రేపుతోంది.. ఈ భేటి ఇటు వైసీపీలో.. అటు టీడీపీలో ఎవరికి ఇష్టం లేకపోయినా.. జగన్ భేటి వెనుక ఏం పరిణామాలకు దారితీస్తున్నాయో ఆందోళన వ్యక్తం అవుతోంది..
కాగా కొన్ని విలువలకు కట్టుబడి కష్టపడి నిర్మించుకున్న ఈనాడు గ్రూపు సంస్థలపై, రామోజీరావుపై.. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి దుష్పచారం చేశారు. రామోజీ ఆస్తులపై మాజీ ఎంపీ ఉండవల్లి తో కేసులు వేయించారు. బదనాం చేశారు.. రామోజీ కూడా తన పత్రిక ద్వారా వైఎస్ ను టార్గెట్ ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశారు.. అసలు రామోజీకి కాంగ్రెస్ అంటేనే నచ్చదట..
ఇలాంటి సమయంలో వైసీపీ అధినేత జగన్ రామోజీతో ఫిలిం సిటీలో భేటి కావడం.. రహస్యంగా చర్చించుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది..ఒక వేళ వీరిద్దరి స్నేహం కొనసాగితే ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతాయి.. కొన్నాళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్న రామోజీరావు సపోర్ట్ దొరికితే జగన్ స్వరూపమే మారిపోతుంది. ఇదే సమయంలో చంద్రబాబుకు కష్టాలు మొదలైనట్టే..