వీరి దోస్తీకి ‘ఓం నగరం’ ఓ సాకు మాత్రమే..

హైదరాబాద్ : రాజకీయాల్లో, మీడియాలో బద్ధ శత్రువులంటూ, ఆపాత మిత్రులంటూ ఎవరూ ఉండరబ్బా.. అందుకే లక్ష నాగళ్లతో దున్నేస్తానన్న కేసీఆరే.. రామోజీరావు లక్షణంగా హత్తుకోవడం ఫోటోల్లో చూస్తున్నాం.. దానికి ‘ఓం నగరం’ ఒక సాకు మాత్రమే.. లేకపోతే ఏంటి..? ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పౌరుషానికి.. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ షాన్ దాన్ ఫరుక్ ఉంది మరి.. అప్పుడు ఫిల్మ్ సిటీని దున్నేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు అదే రామోజీరావు సచివాలయానికి వస్తే వంగివంగి పుస్తకావిష్కరణ చేయడం నిజంగా విడ్డూరం.. అయితే ఇక్కడే రాజకీయావసరాలు ఉన్నాయి మరీ..

ramoji.jpg1

అప్పుడు ఉద్యమనాయకుడిగా ప్రజలను ఉత్తేజ పరిచాలి.. ఆంధ్రోళ్లను తిట్టాలి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అందరి బాగోగులు చూడాలి. నెంబర్ వన్ పత్రికగా ఉన్న ఈనాడు ను బుట్టలో వేసుకుంటే ఇక అధికారం టీఆర్ఎస్ కు ఢోకా ఉండదు.. మళ్లీ అధికారంలోకి రావాలన్నా.. ప్రభుత్వంపై వ్యతిరేకత రావద్దన్న మీడియా సపోర్ట్ చాలా అవసరం.. అదీ ఈనాడు లాంటి మహావృక్షం సపోర్ట్ చాలా చాలా అవసరం.. అందుకే ఉద్యమ నాయకుడి అవతారం చాలించి స్వప్రయోజనాల వేషం వేశారు సీఎం కేసీఆర్.. అందుకే ఇప్పుడు ఆయనకు ‘రామోజీ రావు అన్నా ఓం నగరం అన్నా వల్లమాలిన ప్రేమ పుట్టకొస్తుంది..’

ramoji.jpg3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *