వీరారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

మేడ్చల్ జిల్లా శామిర్ పేట మండలం మూడు చింతలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

కామిడి వీరారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

రూ.75 లక్షలతో చేపట్టిన ముల్టిపర్పస్ కమ్యూనిటీ హాల్ కు, రూ.70 లక్షలతో చేపట్టిన బిటి రోడ్డు నుండి డంపింగ్ యార్డు వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

రూ.99 లక్షలతో చేపట్టిన వీరారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి

ఆనంతరం జరిగిన సభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు

*మంత్రి లక్ష్మారెడ్డి కామెంట్స్*

ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టం

తెలంగాణ వస్తే ఎమోస్తదో అన్న వాళ్లకు సమాధానమే ప్రస్తుత తెలంగాణ అభివృద్ధి

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది

అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్య రంగాల అభివృద్ధి ,అనూహ్యంగా జరుగుతున్నది

అభివృద్ధి, సంక్షేమాల్లో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది

రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దుతున్నారు

అందులో ఆరోగ్య తెలంగాణ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నాం

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు హాస్పిటల్స్ రూపు రేఖలను
మర్చివేశామ్

అనేక వసతులు కల్పించాం

ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చాం

కేసీఆర్ కిట్ల వంటి అనేక పథకాలు తెచ్చాం

ఒక్క ఏడాదిలోనే కేసీఆర్ కిట్ల పథకం వల్ల రాష్ట్ర ప్రజలకు ప్రసూతి లలో అదనంగా ఖర్చులు మిగిలి,

రూ.12,500 కోట్లు మిగులుబాటు జరిగింది

ఇంతగా ప్రజల గురించి గత ప్రభుత్వాలు ఆలోచించలేదు

అప్పటి పాలకులు ప్రజల మేలు కంటే, తమకు ఓట్ల కోసమే పథకాలు రూపొందించారు

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజాభ్యుదయం కోసం పాటు పడుతున్నది

పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అనేక పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి

రైతాంగానికి రైతు బంధు, పంటల పెట్టుబడులు, రైతులకు భీమా వంటి పథకాలు దేశంలో ఎక్కడా, ఎప్పుడూ లేవు

రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ రైతు ఇంటికి 10 రోజుల్లో రూ.5లక్షల బీమా అందుతుంది

పైగా బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రతి రైతు మీద ప్రభుత్వమే కడుతున్నది

ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రజలు వ్యతికిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుద్ధ్యాన్ని పాటించాలి

రోగాలు రాకుండా జాగ్రత్త పడటం, రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, వెంటనే చికిత్సకు

వెళ్లడం,అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయించుకోవాలి

రోగాలు రాకుండా ముందుగా పిల్లలకు టీకాలు వెయిస్తున్నాం

అందరికి కంటి పరీక్షలు చేయబోతున్నాం. ఆగస్టు నెలలో ప్రారంభించాలని భావిస్తున్నాం

ఉచితంగా పరీక్షలు అద్దాలు, మందులు, ఆపరేషన్లు చేయిస్తున్నాం

ఇంటింటికి ఆరోగ్య పరీక్షలు చేస్తాం. ఆ రిపోర్ట్స్ ని ఆన్లైన్ చేస్తాం

రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయించే, తెలంగాణ డయాగ్నోసిస్ కార్యక్రమాన్ని చేపట్టాం

రాష్ట్రంలో వాటిని విస్తృతంగా ఏర్పాటు చేస్తాం

108,102, పార్థివ వాహనాల సంఖ్యను పెంచాం

108 బైక్ అంబులెన్స్ లు, రెక్కల వాహనాలు మారుమూల ప్రాంతాల వైద్యం కోసం ఇచ్చాం

తెలంగాణ అభివృద్ధి పథకాలు కూడా ఆరోగ్య తెలంగాణ దిశగా రూపొందించారు సీఎం

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారం వంటి పథకాలు ఆరోగ్య తెలంగాణ సాధనకు ఉపయోగపడేవి

ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారి కుటుంబాల కోసం చేపట్టిన వెల్ నెస్ సెంటర్లు అద్భుతంగా పని చేస్తున్నాయి

బంగారు తెలంగాణలో, ఆరోగ్య తెలంగాణ ఉండాలని ఆశిస్తున్నాను

ఇంత గొప్ప కార్యక్రమాలు తీసుకుంటూ, ప్రజల మేలు కోసం పని చేస్తున్న సీఎం ని ఎల్లప్పుడూ ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను

ఈ కార్యక్రమాల్లో మేడ్చెల్ ఎమ్మెల్యే మిలిపెద్ది సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ప్రజలు పాల్గొన్నారు

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *