
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్దపల్లి జిల్లా VRA JAC ఆధ్వర్యంలో గత 45రోజులుగా వారి డిమాండ్ల పరిష్కారానికై చేస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు,
ఈసందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ VRA లు తమ డిమాండ్లను పరిష్కరించేందుకు గత 44 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవరిస్తోందని ,గతంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ GO వెంటనే విడుదల చేయాలని,
అర్హత కలిగిన VRAలకు ప్రమోషన్స్ ఇవ్వాలని,
55 సంవత్సరాలు పై బడిన VRA లందరి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు,
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 22 మంది VRA ల కుటుంబసభ్యులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు..
ఈకార్యక్రమంలో VRA ల సంఘం అధ్యక్షుడు అమీనోద్దీన్, కలబోయిన సరిత, ఉప్పు దేవయ్య, కొప్పుల రాజేందర్, మారుపాక కిరణ్,చింతల వరకుమార్, పేరుక వెంకటేశ్వర్లు, md రఫిక్ మరియు పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాల VRAలు పాల్గొన్నారు…