Breaking News

వి.ఎస్.టి.జంక్షన్ ఫ్లై ఓవర్ల నిర్మాణాలపై సమీక్షించిన మంత్రి నాయిని

వి.ఎస్.టి.జంక్షన్ ఫ్లై ఓవర్ల నిర్మాణాలపై సమీక్షించిన మంత్రి  నాయిని

జి.హెచ్.ఎం.సి. వారు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక ( స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ ) క్రింద వి.ఎస్.టి. జంక్షన్ అబివృద్ది మరియు వి.ఎస్.టి. జంక్షన్ రోడ్ల వెడల్పు పనులపై రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహా రెడ్డి శుక్రవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. సునీల్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ , రోడ్లు, భవనాల శాఖ మరియు ఆర్.టి.సి. ఇంచార్జ్ ఎం.డి. , జి.హెచ్.ఎం.సి. కమీషనర్ బి.జనార్దన్ రెడ్డి , పరిశ్రమల శాఖ కమీషనర్ అహ్మద్ నదీం, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్. చైర్మన్  మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమా రెడ్డి తదితరులతో సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి సమావేశంలో మాట్లాడుతూ ఈ పథకం క్రింద ఇందిరా పార్క్ నుండి వి.ఎస్.టి. జంక్షన్ వరకు మరియు రాంనగర్ నుండి బాగ్ లింగంపల్లి వరకు రోడ్లను వెడల్పు చేయడంతో పాటు ఫ్లై ఓవర్ లను నిర్మించేందుకు ప్రభుత్వం 426 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. దీంతో పాటు నాలుగు లేన్ల ఎలివేటేడ్ కారిడార్ ను 3 కి.మీ. మేరకు అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు. ఫ్లై ఓవర్ యొక్క నిర్మాణానికి ప్రైవేటు భూములతో పాటు జి.హెచ్.ఎం.సి,ఆర్.టి.సి, పరిశ్రమల శాఖలకు చెందిన భూములు ప్రభావితం అవుతున్నందున వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు సమీక్ష నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాంనగర్ నుండి బాగ్ లింగంపల్లి రోడ్డు వరకు లేన్ బై డైరెక్షనల్ ఇండిపెండెంట్ ఫ్లై ఓవర్ ఒక కి.మీ. మేరకు నిర్మించనున్నామని వెల్లడించారు. రోడ్ల వెడల్పు , ఫ్లై ఓవర్ ల నిర్మాణం కోసం ఆర్.టి.సి.కి చెందిన భూమిని , వి.ఎస్.టి. కు చెందిన భూమి అవసరం ఉందని అదే విదంగా విద్యుత్ శాఖ భూమికి ప్రత్యామ్నాయంగా కొంత భూమిని సేకరించాల్సి ఉందని మంత్రి తెలియజేశారు. ఇందిరా పార్క్ నుండి వి.ఎస్.టి. మెయిన్ రోడ్డు వరకు మరియు రాంనగర్ నుండి బాగ్ లింగంపల్లి వరకు ప్రస్తుతం ఉన్న 80 ఫీట్ల రోడ్డుకు అదనంగా మరొక 80 ఫీట్ల రోడ్డును నిర్మించాల్సి ఉందని తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ఈ రోడ్ల వెడల్పు , ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు వి.ఎస్.టి. యాజమాన్యం , ఆర్.టి.సి. అధికారులు అంగీకరించినందున సంబందిత పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *