వివిధ శాఖలలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష

వివిధ శాఖలలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష

వివిధ శాఖలలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన ఫలితాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయం అనుబంధరంగాలు, ఫైనాన్స్, రెవెన్యూ, ప్లానింగ్, జి.ఏ.డి, హోం, లా, పరిశ్రమలు,ఐటి, అటవీ, పౌరసరఫరాలు, ఇరిగేషన్ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.

వివిధ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, శాఖల మద్య సమన్వయం, ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తదితర అంశాలపై సి.యస్ చర్చించారు. ప్రతి శాఖ లక్ష్యాలను ఏర్పరచుకొని పనిచేయాలని అన్నారు.

వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి రాష్ట్రంలో పంటల సాగు, ఉత్పత్తి నీటి
వసతి, పాల ఉత్పత్తి, చేపల పెంపకం, ఎరువులు, విత్తనాల పంపిణీ,పశుగ్రాసం, ఉత్పాదకత, గుడ్లు, మాంసం, చేపల ఉత్పత్తిపై చర్చించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి అవసరాలు, ఉత్పత్తి పెంపుకు చర్యలు, నాణ్యత, మార్కెటింగ్ వివరాలు, ప్లాంట్ల సామర్ధ్యం పెంపు వంటి అంశాలపై సమీక్షించారు. చేపల పెంపకంపై మత్స్సశాఖ, నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. పశుగ్రాసంపై ప్రత్యేకంగా చర్చిస్తూ ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ, మార్కెటింగ్ తదితర శాఖలన్నీ కలిసి కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకుి వ్యాల్యూ ఆడిషన్ రావటంతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, మార్కెటింగ్, గోడౌన్ల సామర్ధ్యం, వ్యవసాయ యంత్రీకరణ, వ్యవసాయ సబ్సిడీలు, సేంద్రీయ ఎరువుల వాడకం వంటి అంశాలపై చర్చించారు. వ్యవసాయ, నీటి పారుదల శాఖలు సంయుక్తంగా పంటల సాగుపై కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సూచించారు. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పాదక సాధించేలా రైతులను
ప్రోత్సహించాలన్నారు.

అటవీ శాఖకు సంబంధించి సమీక్షిస్తూ, ఏయిర్, వాటర్, క్వాలిటీఇండెక్స్, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ, నాణ్యత, ఫారెస్ట్ కార్పోరేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం, డిగ్రేడ్ ఫారెస్ట్ లలో మొక్కలు నాటడం లాంటి పనులు చేపట్టాలన్నారు. అటవీ, పిసిబి, ఇపిటిఆర్ ఐ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎక్సైజ్, జిఎస్ టి, రిజిస్ట్రేషన్లు, మైనింగ్ ల ద్వారా వస్తున్న ఆదాయపు వివరాలు తెలుసుకున్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులను ఇంగ్లీషుతో పాటు తెలుగులోను జారీ అయ్యేలా ట్రాన్స్ లేషన్ శాఖ ద్వారా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. టెక్స్ టైల్ పార్కు, ఫార్మాసిటి, నిమ్జ్, ఇండస్ట్రియల్ క్లస్టర్, ఇఓడిబి, టియస్ఐపాస్, ఫుడ్ ప్రాసెసింగ్, జినోం వ్యాలి, లెదర్ పార్కు, యంఎస్ యంఈ, ఫైబర్ నెట్ వర్క్, ఈ ప్రొక్యూర్ మెంట్ తదితర అంశాలపై పురోగతిని సమీక్షించారు. ఐటి శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందేలా చూడాలన్నారు.ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్ డేట్ చేయాలన్నారు. వివిధ శాఖల వెబ్ సైట్ లను సమీక్షించాలన్నారు.మీ సేవల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేశ్వర్ తివారి, ముఖ్య కార్యదర్శులు శ్రీ అధర్ సిన్హా, శ్రీ రామకృష్ణారావు, శ్రీ సోమేష్ కుమార్, శ్రీ రజత్ కుమార్, శ్రీ రాజీవ్ త్రివేది, శ్రీ వికాస్ రాజ్, శ్రీ సి.వి.ఆనంద్, శ్రీ జయేష్ రంజన్, శ్రీమతి శాలినీ మిశ్రా, కార్యదర్శులు శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీ శివశంకర్, శ్రీ పార్ధసారధి, శ్రీ నదీమ్ అహమ్మద్, శ్రీ ఆర్.వి.చంద్రవదన్, శ్రీమతి శ్రీలక్ష్మీ, పిసిసిఎఫ్ శ్రీ పి.కె.ఝా, పోలీస్ ఉన్నతాధికారులు శ్రీ అంజనీకుమార్, శ్రీమతి తేజ్ దీప్ కౌర్మీ నన్,ప్రొటోకాల్ డైరెక్టర్ శ్రీ అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *