వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్న వరంగల్ జిల్లా వాసులను పరామర్శించిన మంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్ : హైదరాబాద్ లోని వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్న వరంగల్ జిల్లా వాసులను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఫైర్ వర్క్స్ లో అగ్నిప్రమాదంలో గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న సురేష్ ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు ఉదయం పరామర్శించారు. ఆయన కోలుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే చికిత్స పొందుతున్న ఏటూరి నాగారం జడ్పీటీసీ భర్త సలీమ్ పాష వద్దకు వెళ్లి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తరువాత సికింద్రాబాద్ లోని సన్ షైన్ దవాఖానాలో చికిత్స పొందుతున్న పర్వతగిరి నివాసి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శిశ్యుడు గా ఉన్న అడ్వకేట్ సాంబశివరావు గౌడ్ ను పరామర్శించారు. అనంతరం సికింద్రాబాద్, కిమ్స్ దవాఖానాలో చికిత్స పొందుతున్న నెల్లుట్ల సర్పంచ్ గాడెపల్లి చంద్రకళ భర్త గాడెపల్లి శ్రీనివాస్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం, చికిత్స గురించి కుటుంబ సభ్యులు కిమ్స్ డాక్టర్లతో మాట్లాడారు. నేడు డిశ్చార్జి అవుతున్నందున ఇంటి దగ్గర మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

kadiyam srihari new 1     kadiyam srihari new 2

About The Author

Related posts