వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను హత్య చేయించింది..

హైదరాబాద్ : ఖైరతాబాద్ రైల్వే గేట్ ఎదురుగా కాపురముండే  తౌసిఫ్ ఫాతిమా, అమ్జద్ అలీ(54) భార్యభర్తలు. కొంతకాలంగా ఫాతిమా ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలిసి గొడవలు జరుగుతున్నాయి. తన సరసాలకు భర్త అడ్డువస్తున్నాడని తెలిసి ఫాతిమా 3 లక్షలు సుపారీ ఇచ్చి హత్యకు స్కెచ్ గీసింది.. తయ్యబ్ అనే యువకుడిని హత్య చేయమని డబ్బులు ఇచ్చింది.. ఉదయం 4 గంటలకు నీళ్లు పట్టుకోవడానికి నిద్ర లేస్తాడని అప్పుడు చంపేయమని కోరింది..

కాగా రోజులాగే నీళ్లు పట్టుకోవడానికి నిద్రలేసిన అలీని తయ్యబ్ రాడ్ తో బలంగా కొట్టి పారిపోయాడు. కానీ చనిపోలేదు. గుమ్మంలో అపస్మారక స్థితిలో ఉన్న భర్తను కర్రతో చావబాదేసి చంపేసింది ఫాతిమా.. అనంతరం ఇంట్లోకి వెళ్లి ఉదయం భర్తను కొట్టి చంపారని నాటకమాడింది.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసులు ఫాతిమా, సుపారీ తీసుకొని హత్య చేసిన తయ్యబ్ లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *