వివాహానికి 20 వేల ఆర్థిక సహాయం;జిల్లా కలెక్టర్…

కరీంనగర్; నిరుపేద వికలాంగుని కుతూరు వివాహానికి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మంజురు చేసిన 20 వేల చెక్కును బుదవారం కలెక్టర్ నీతూ ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన ఆడెపు రాజేశం పేద కుటుంబానికి చెందిన వికలాంగుడనని, తన కూతురు వివాహానికి ఆర్థిక సహాయం మంజురు చేయాలని కోరుతూ ధరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు. అతని కూతురు వివాహానికి ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటి నిధుల నుండి 20 వేలు ఆర్థిక సహాయం మంజురు చేసినట్లు తెలిపారు. అట్టి చెక్ ను ఆడెపు రాజేశం కు అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *