విమాన శకలాలు బయటపడ్డాయి..

జకార్తా : ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తూ ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఏసియా విమాన శకలాలను జావా సముద్రంలో గుర్తించినట్టు ఆస్ట్రేలియాకు చెందిన రెస్క్యూ అధికారులు తెలిపారు. అయితే ఖచ్చితంగా అవి ఈ విమాన శకలాలేనా అన్న విషయాన్ని  నిర్ధారించలేమని కూడా వారన్నారు.

నంక్కా దీవికి సుమారు వంద మైళ్ళ దూరంలో ఇవి కనిపించాయని అన్నారు.. సముద్రంలో ఓ వస్తువు  కనిపించినట్టు ఇండోనేసియా ఉపాధ్యక్షుడు చెప్పగా…బెలిటుంగ్ దీవి దగ్గర ఆయిల్ జాడలు చూశామని, అది విమాన ఇంధనమా కాదా అన్నది తేలాల్సి ఉందని ఇండోనేసియా ఎయిర్ ఫోర్సు ప్రతినిధి ఒకరు అన్నారు.

ఈ ప్లేన్ లో ప్రయాణించిన వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. అటు-గాలింపు చర్యలను ఉధృతం చేసినప్పటికీ ప్రతికూల వాతావరణం వల్ల ఇవి మందకొడిగా సాగుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.