
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది. దాన్ని వారు బాగానే తట్టుకున్నారు. పక్కవాళ్లకి కరెంట్ షాక్ ఇచ్చి.. తెలంగాణ ప్రజల అంతకంటే ధనవంతులు కదా వీరికి ఇవ్వకపోతే ఎలా అని ఆలోచించారో ఏమో సీఎం కేసీఆర్ విద్యుత్ చార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.
కానీ పేదలకు మాత్రం కొంత మినహాయింపునిచ్చారు. 400 యూనిట్లపైన విద్యుత్ వాడిన వారందరిని ఒకే శ్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చారు. దీనివల్ల 200 యూనిట్ల నుంచి 400 యూనిట్లలోపు వాడే చిన్న దుకాణదారులు, కుటీర పరిశ్రమలపై కరుణ చూపారు. 400 యూనిట్లపైనే విద్యుత్ వాడే పరిశ్రమలు, వీధిదీపాలు,తాగునీటి పథకాలు నిర్వహించే పంచాయతీలకు ఈ పెంపు భారం కానుంది.
రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విద్యుత్ రాయితీ భారం పెరిగిపోయిందని.. రాష్ట్ర ప్రభుత్వంపై రాయితీల భారం రూ4257 కోట్లు పడుతోందని.. అందుకే విద్యుత్ చార్జీల భారం పెంచకతప్పలేదని ప్రభుత్వం పేర్కొంది.
50 యూనిట్ల వరకూ చార్జీ – యూనిట్ కు 1.45 (మార్పు లేదు)
50-100 యూనిట్ల వరకు..-యూనిట్ కు రూ.2.60 (మార్పు లేదు)
200 యూనిట్లలోపు -యూనిట్ కు రూ.3.60 (మార్పు లేదు)
201-250 యూనిట్ల కు -యూనిట్ కు 6.38(భారీగా పెంపు)
300-400 యూనిట్లకు -యూనిట్ కు రూ. 7.38(భారీగా పెంపు)