
ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం కేసీఆర్ పర్యటించారు. సింగరేణి ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి లో కొత్తగా నిర్మిస్తున్న 600 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఇదివరకే సింగరేణి 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను నిర్మించింది. అది వచ్చే నవంబర్ లో ప్రారంభం కానుంది. ఇప్పుడు కొత్తగా మరో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కు సింగరేణి పూనుకుంది. దీన్ని సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ శ్రీధర్, ఎంపీ సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, సోమరపు సత్యనారాయణ, టీబీజీకేఎస్ నేతలు పాల్గొన్నారు.