విద్యుత్ పొదుపు కోసం ఇంటింటికి 2 ఎల్ఈడీ బల్బులు

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఆదా కోసం మరో సరికొత్త పథకాన్ని అమలు చేసేందుకు ముందడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన డీఈఎల్ పీ పథకం లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి ప్రజలందరికీ ఇంటింటికి 2 ఎల్ ఈ డీ బల్బులు పంపిణీ చేేసేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ ప్రాజెక్టు కింద 60 మెగావాట్ల సంప్రదాయ బల్బుల స్థానంలో 9 వాట్ల రెండు ఎల్ ఈ డీ బల్బులను ప్రతి ఇంటికీ డిస్కమ్ ల ద్వారా పంపిణీ చేస్తారు.  ఆరు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ముందుగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు.  2018లోగా తెలంగాణ అంతటా ఈ బల్బులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు బల్బుల పంపిణీ తర్వాత 5 స్టార్ ఎల్ ఈడీ ఫ్యాన్లను కూడా పంపిణీ చేస్తారట.. దీంతో ఇప్పుడు వినియోగిస్తున్న విద్యుత్ లో 90శాతం ఆదా అవుతుంది. 6 బిలియన్ డాలర్ల సొమ్ము ప్రభుత్వానికి ఆదా అవుతుంది. దీంతో విద్యుత్ పై వ్యయం తగ్గి ఇతర రంగాలకు మళ్లించే అవకాశం ఉంటుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *