Breaking News

విద్యుత్ ఇవ్వాలని మోడీకి కేసీఆర్ లేఖ

modi-kcr

హైదరాబాద్, ప్రతినిధి : వచ్చేది ఎండాకాలం.. ఇప్పుడిప్పుడే కోతలు మొదలవుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత కోతలు పెరుగుతాయి. రైతులకు కరెంటు ఇవ్వకపోతే రోడ్డెక్కడం ఖాయం.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధానికి కరెంటు ఇవ్వాలని లేఖ రాశారు. తూర్పు గ్రిడ్ నుంచి 500 మెగావాట్ల విద్యుత్ ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే కరెంటు విషయంలో ఏపీ ప్రభుత్వం పునర్విభజన చట్టాన్ని ఉల్లంగించి తెలంగాణకు విద్యుత్ ఎగ్గొడుతోందని.. వెంటనే తమకు ఏపీ రావాల్సిన 54 శాతం విద్యుత్ ను కేటాయించాలని కోరారు. అలాగే కొత్తగా కేటాయించనున్న బొగ్గు బ్లాకుల్లో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు క్షేత్రాలను కేటాయించాలని మరో లేఖ రాశారు. దాంతో వచ్చే ఐదేళ్లలో బొగ్గు అవసరాలు వెల్లడించారు. దానికనుగునంగా కేటాయింపులు జరపాలని లేఖలో కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *