విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు టీ సర్కారు ప్లాన్

తెలంగాణ అసెంబ్లీలో విద్యావ్యవస్థ,ప్రక్షాళనపై చర్చ జరిగింది.. ప్రైవేటు , కార్పొరేట్ విద్యా ఆగడాలు.. నాణ్యమైన విద్య కోసం ఉపాధ్యాయ రిక్రూట్ మెంట్ లో మార్పులపై విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసెంబ్లీలో వివరణాత్మక ప్రసంగం చేశారు. ఉపాధ్యాయ రిక్రూట్ మెంట్ లో లో భాగంగా బట్టీ పద్ధతికి స్వస్తి చెప్పి.. వివరణాత్మక రాత పరీక్ష, తరగతి బోధనా నైపుణ్య ప్రదర్శన, భావ ప్రకటనా నైపుణ్యం తదితర అంశాలను డీఎస్సీలో పరీక్షించి ఎంపికైన అభ్యర్థులకు డైట్ లలో ఆరునెలల శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది..

ఇవేకాకుండా విద్యావ్యవస్థ ప్రక్షాళనకు సంచలన మార్పులు చేసేందుకు చర్చ చేశారు. కడియం శ్రీహరి తెలంగాణలో విద్యావ్యవస్థ ప్రక్షాళనపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. సీనియారిటీ ప్రకారం ప్రధానోపాధ్యాయులను ఎంపిక చేయకుండా  వారికోసం ఒక సర్టిఫికెట్ కోర్సు  ఉత్తీర్ణులైతేనే ప్రధానోపాధ్యాయుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రేషనైలేజన్ ద్వారా పాఠశాలల్ని విలీనం చేసి ఉపాధ్యాయులను క్రమబద్దీకరీంచాలని ప్రభుత్వం యోచిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *