
ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు పార్థివ దేహాన్ని శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించి నివాళులర్పించారు. హబ్సిగూడ లోని విద్యాసాగర్ రావు ఇంటికి సతీ సమేతంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానభూతి తెలిపారు.హబ్సిగూడలోని విద్యాసాగర్‌రావు నివాసానికి చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి ఆయన పార్థివదేహాన్ని చూసి తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. విద్యాసాగర్‌రావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. సాగునీటి రంగంలో ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. నీటిపారుదల రంగంలో అపారమైన అనుభవాన్ని గడించిన విద్యాసాగర్‌రావు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుసీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, సీఎం సతీమణి శోభ తదితరులు ఉన్నారు.
బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్‌రావు కొద్ది రోజుల క్రితమే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి చేరి చికిత్సపొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపాలు ప్రకటిస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్రను, నీటిపారుదల రంగంలో ఆయన చేసిన కృషిని కొనియాడుతున్నారు.