అల్ఫోర్ విద్యార్ధి జాతీయస్ధాయి పుట్ బాల్ పోటీలకు ఎంపిక

క్రీడలు విద్యార్ధులకు చాలా అవసరమని, వాటిద్వారా విద్యార్ధులు వివిధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని అల్ఫోర్ విద్యాసంస్ధల అధినేత శ్రీ వి.నరేందర్ రెడ్డి అన్నారు.  స్ధానిక కొత్తపల్లిలోని అల్ఫోర్ హైస్కూల్ (సి.బి.ఎస్.ఇ.)లో ఏర్పాటు చేసినటువంటి విద్యార్ధుల అభినందన సభలో ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భముగా ఆయన  మాట్లాడుతూ నేటి సమాజములో వివిధ సంస్ధల వారు నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షల్లోను క్రీడాంశాలకు సంబంధించినటువంటి విషయాలను సైతం ప్రస్తావిస్తున్నారన్నారు. క్రీడలలోని వివిధ అంశాలలో విద్యార్ధులకు పట్టు కల్పించడానికై వార్ఫిక ప్రణాళికలో భాగంగా విద్యార్ధులకు అనుభవజ్ఞులైన వ్యాయామ ఉపాధ్యాయులచే విద్యార్ధులకు అన్ని వసతులు సమకూర్చి శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా విశేష ప్రతిభను కనబర్చిన విద్యార్ధులకు వివిధ స్ధాయిలలో నిర్వహించినటువంటి పోటీలకు పంపిస్తామని తెలుపుతూ, ఇటీవల కాలములో రంగారెడ్డి జిల్లా కేంద్రములోని ఇబ్రహీంపట్నంలో ఎస్.జి.ఎఫ్. వారు నిర్వహించినటువంటి అండర్ -14 బాలబాలికల పుట్ బాల్ పోటీలలో పాఠశాలకు చెందినటువంటి నందెల్లి హర్షిత్  అసామాన ప్రతిభతో ఘనవిజయాన్ని నమోదు చేయడమే కాకుండా, త్వరలో మధ్యప్రదేశ్లో నిర్వహించబోయే అండర్ -14 జాతీయస్ధాయి పోటీలకు ఎంపికవ్వడం కరీంనగర్ జిల్లాకే గర్వకారణమని తెలిపారు. కేవలం ఒకే విద్యార్ధి కరీంనగర్ జిల్లా నుండి ఎంపికవ్వడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. విజేతకు పుష్పగుచ్చంతో సత్కరించి జాతీయస్ధాయిలో సైతం ఘన విజయాన్ని నమోదు చేయాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో
ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *