విద్యార్థుల జీవితాలతో సర్కారు ఆటలు

ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినట్టు ఉంది విద్యార్థుల పరిస్థితి.  పెండింగ్ బకాయిలు చెల్లించక ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతోంది.. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిలు ఎంతో తెలుసా..దాదాపు 2 వేల కోట్లు.. ఇవి విడుదల కాకపోవడం విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. కళాశాలల యాజమాన్యాలు పేద విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి.. దీంతో చాలా మంది పేదల విద్యార్థులు డబ్బులు కట్టలేక చదువులకు దూరం అవుతున్నారు..

ఉన్నత చదువులకు దూరం..

బీటెక్ పూర్తయిన విద్యార్తులు చాలా మంది ఎంటెక్, ఎంసీఈ ఇతర వృత్తి విద్య సీట్లను సాధించి ప్రవేశాలకు సిద్దంగా ఉన్నారు. కానీ వీరికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా చదివిన కాలేజీలు చుక్కలు చూపిస్తున్నారు. దాదాపు రెండేళ్ల ఫీజు రీయింబర్స్ మెంట్ ను సర్కారు కాలేజీలకు చెల్లించకపోవడంతో విద్యార్థుల పాసైనా సదురు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు.. మొత్తం ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని మొండికేస్తున్నాయి. దీంతో సీటు వచ్చినా చేరలేని దుస్తితిలో పేద విద్యార్థులు ఉన్నారు. కాగా డబ్బులున్న వాళ్లు కట్టి తమ సర్టిఫికెట్లు తీసుకెళుతుండగా మిగతా వారు చదువులకు దూరం అయ్యే పరిస్థితి నెలకొంది.

సర్కారు కనికరించేనా.?

దాదాపు 2 వేల కోట్లకు పైగా కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం బకాయి పడింది.  రెండు నెలల క్రితం 500 కోట్లు విడుదల చేసినా అవి ఏ మూలకు సరిపోలేదు. 2 వేల కోట్లు రెండేళ్ల బకాయిలు విడుదల చేస్తేనే విద్యార్థులకు సర్టిఫికెట్లు వారి చదువులు సాగుతాయి.. ఈ విషయంలో కేసీఆర్ సర్కారు చొరవ తీసుకోవాలని విద్యార్థులు, కళాశాలలు కోరుతున్నాయి.. ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్ ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *