విదేశీ దోరణలు మానండి – గవర్నర్ నరసింహన్

హైదరాబాద్: పూర్వకాలంలో ఇంట్లోని పెద్ద వాళ్ళు మాతృబాష లోనే మాట్లాడ డానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవారని, దానివలన కుటుంబంలోని అందరికి మాతృ బాషలో మాట్లాడడం అలవాటు అయ్యేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని. అందరూ హాయ్, బాయ్ అని అంటున్నారని, నమస్కారంతో పలకరించుకునే రోజులు పోయాయని, అని అన్నారు తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం జరిగిన తెలుగు విశ్వవిద్యాలయం పద్నాల్గవ స్నాతకోత్సవంలో అధ్యక్ష ప్రసంగం మొత్తం తెలుగులోనే మాట్లాడారు, గవర్నర్ నరసింహన్. మాతృ బాష అందరూ నేర్చుకోవాలని, మాతృభాషలోనే మాట్లాడాలని గవర్నర్ చెప్పారు. విదేశాలలో ఎక్కడకు వెళ్ళినా వారి మాతృ బాషలోనే మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తారని, మాతృబాష లో మాట్లాడడానికి సిగ్గు పడకూడదని చెప్పారు గవర్నర్. ఈ రోజుల్లో సరస్వతి, లక్ష్మీగా మారిపోయిందని చెప్పారు. ఒక సామాన్యుడు, మాన్యుడు గా మారడానికి విశ్వవిద్యాలయం దోహదం చేస్తుందని చెప్పారు గవర్నర్ నరసింహన్. తెలుగు విశ్వవిద్యాలయం నుండి పట్టాలు పొందిన విద్యార్ధులు, గ్రూపులు గా ఏర్పడి, గ్రామాలకు వెళ్లి, అక్కడి ప్రజలకు మన సాహిత్యం, సంస్కృతి, లలిత కళలు, వారసత్వసంపద గురించి అవగాహన కల్పించాలని గవర్నర్ చెప్పారు. విద్యార్ధులందరికి సామాజిక సేవ చేయాల్సిన భాధ్యత ఉందని చెప్పారు. స్వచ్ఛత అభియాన్ కింద కాలనీలను దత్తత తీసుకుని పరిశుభ్రత గురించి అవగాహన కలిగించాలని చెప్పారు. అమెరికా వాళ్ళు చెబితే మనం యోగా చేస్తున్నాం, అమెరికా వాళ్ళు చెబితే మనం ప్రాణాయామం ఆరోగ్యానికి మంచిదని తెలుసుకుంటున్నాం. మన సంస్కృతి గురించి బయటివారి ద్వారా తెలుసుకుని పాటించే దానికంటే , మన సంస్కృతి గురించి మనమే తెలుసుకుని ఆచరిస్తే మంచిదని చెప్పారు గవర్నర్ నరసింహన్. ఈ సందర్భంగా, తెలుగు విశ్వవిద్యాలయం పద్నాల్గవ స్నాతకోత్సవం ముఖ్య అతిధి ఆచార్య రవ్వా శ్రీహరిని, గవర్నర్ సత్కరించారు. తెలంగాణ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉపాధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

governer narasimhan 1     governer narasimhan 2     governer narasimhan 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *