విదేశాల్లో తిరిగేందుకే మోడీ ప్రధాని అయ్యాడు..

కరీంనగర్ : విదేశాల్లో తిరిగేందుకే మోడీ ప్రధాని అయ్యాడని ఆరోపించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. శుక్రవారం కరీంనగర్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీ ఫ్యాషన్ , సోకుల వల్ల దేశ ఖజానాకు భారీ చిల్లు పడుతుందని ఆరోపించారు.  మోడీ విదేశాలకే వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నాడని.. దేశంలోని రైతులు, ప్రజల సమస్యలు పట్టడం లేదని ధ్వజమెత్తారు. రోజురోజుకు కేంద్రం ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోందని ధ్వజమెత్తారు. ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఈ సమావేశంలో కరీంనగరానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *