విదేశాలలో వర్మ మొగలిపువ్వు …

ram-gopal-varma (4) mogalipuvvu mogalipuvvu (2)సచిన్ జోషి కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మొగలిపువ్వు’. మీరా చోప్రా, కైనత్ అరోరా కథానాయికలు. జెడ్3 పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జీత్ గంగూలీ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంది సీజర్ గొంజాల్వేస్ కోరియోగ్రఫీలో సచిన్ జోషి, మీరా చోప్రాలపై ఇటివలే ఓ శృంగారాత్మక గీతాన్ని తెరకెక్కించారు. వర్మ మార్క్ రొమాంటిక్ టచ్ ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణ.  

ఓ సినిమా చిత్రీకరణ కోసం పదిహేనేళ్ళ తర్వాత వర్మ విదేశాలకు వెళ్ళడం విశేషం. చివరిసారిగా 2000లో ‘మస్త్’ చిత్రంలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్ళారు. ఆ తర్వాత ‘మొగలిపువ్వు’ వర్మను విదేశాలకు తీసుకెళ్ళింది.   

వివాహిత వ్యక్తి ఓ మహిళతో పెట్టుకున్న సంబంధం ఎంత దూరం వెళ్ళింది. అక్రమ సంబంధాలు, వాటిలో సెల్ ఫోన్ పాత్ర ఎంతుంది అనే పాయింట్ మీద వర్మ థ్రిల్లర్ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ‘ప్రతి పెళ్ళైన మగాడి సెల్ ఫోనులో భార్యకు తెలియని సీక్రెట్ ఉంటుంది’ అంటూ సెల్ ఫోనును విలన్ చేసేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *