విదేశాలలో రీమేక్ చేస్తున్న లారెన్స్‌ ‘కాంచన’

రాఘవ లారెన్స్‌ నటించి దర్శకత్వం వహించిన ‘కాంచన’ చిత్రం చైనీస్‌,కొరియన్‌ మరియు థాయ్‌ భాషల్లో నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం సౌత్‌లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం విదేశీ ప్రేక్షకులను సైతం అలరించేందుకు సిద్ధమవుతోంది. రామ సంస్థ అధినేత పూదోట సుధీర్‌కుమార్‌(మిస్టర్‌ జాన్‌) చైనా, కొరియన్‌, థాయ్‌ భాషల్లో రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ”లారెన్స్‌,రాయ్‌లక్ష్మి, శరత్‌కుమార్‌ కీలక పాత్రధారులుగా రూపొందిన ‘కాంచన’ చిత్రం ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. సౌత్‌ సినిమా ఇతర భాషల్లో రీమేక్‌ కాబోతుండడం ఇదే మొదటిసారి. ఆ అవకాశం మా బ్యానర్‌కు దక్కినందుకు ఆనందంగా ఉంది” అని చెప్పారు. ప్రస్తుతం రామ సంస్థ కన్నడలో నిర్మించిన ఓ సినిమా సెన్సార్‌ కార్యకమ్రాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తెలుగులో ఓ సినిమా సెన్సార్‌ దశలో ఉంది. మూడవ చిత్రంగా సుమంత్‌ హీరోగా, ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం రెండో షెడ్యూల్‌లో ఉంది. శివనాగేశ్వరరావు దర్శకుడిగా ఈ నెల 21న ఓ సినిమా అమలాపురంలో ప్రారంభమైంది. నూతన సంవత్సరం కానుకగా ఎస్‌.ఎస్‌. కాంచి దర్శకత్వంలో ఇంకో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇంకా ఈ రామ సంస్థ ద్వారా నిర్మాత పూదోట సుధీర్‌కుమార్‌(మిస్టర్‌ జాన్‌) మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *